News August 22, 2025
HYD: వింటూనే ఉన్నాం.. ఎప్పుడు చూస్తామో!

ప్రత్యేక తెలంగాణ వచ్చి నేటికి 11ఏళ్ల 2 నెలల 20 రోజులైంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఓ పదం వింటూనే ఉన్నాం.. ‘మూసీని అభివృద్ధి చేస్తాం’ అని. ఈ పదం వినీ.. వినీ నగరవాసికి విసుగెత్తిపోయింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇపుడు కాంగ్రెస్ సర్కార్‌కు ఈ పదం పలకడం అలవాటైపోయింది. మూసీని అభివృద్ధి చేయకుండా.. చేస్తాం, చేస్తాం అని ఇంకెన్నేళ్లు చెబుతారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News August 22, 2025
HYD: 7 షేవింగ్ బ్లేడ్లను మింగాడు.. కాపాడిన డాక్టర్లు

వైద్య చరిత్రలో అరుదైన ఘటన ఇది. సిటీకి చెందిన 37 ఏండ్ల వ్యక్తి ఈనెల 16న మానసిక సమస్యతో 7 షేవింగ్ బ్లేడ్లను మింగాడు. కుటుంబీకులు గాంధీ ఎమర్జెన్సీలో చేర్పించారు. జనరల్ సర్జరీ విభాగంలో డాక్టర్లు పేషంట్‌కు వైద్యపరీక్షలు చేసి, ఆహారం ఇవ్వకుండ, మందులు, ప్లూయిడ్స్ ఇచ్చారు. లక్కీగా జీర్ణాశయంలో ఎలాంటి రక్తగాయాలు కాలేదు. మలద్వారం వెంట 7 బ్లేడ్లు పడిపోవడంతో పేషంట్‌ను డిశ్చార్జీ చేసినట్లు డా.సునీల్ తెలిపారు.
News August 22, 2025
కూకట్‌పల్లి: సహస్ర హత్య.. బాలుడు రాసిన పేపర్ ఇదే!

సహస్ర హత్య కేసులో బాలుడికి సంబంధించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఆ ఇంట్లోకి వెళ్లే ముందు ఎలా వెళ్లాలి? ఏం చేయాలి? అనేదానిపై పూర్తిగా పేపర్ పైన రాసుకొని మరీ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పేపర్‌లో లాస్ట్ లైన్ మిషన్ కంప్లీటెడ్ అని రాసుకొన్న బాలుడి ఆలోచన విధానం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. పదేళ్ల బాలుడి మైండ్‌సెట్ ఇలా ఉండటం పట్ల అంతా నివ్వెరపోతున్నారు.
News August 22, 2025
కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను హత్య చేసిన బాలుడు!

కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో బాలిక సహస్ర హత్య కేసు కీలక మలుపు తిరిగింది. 5వ రోజు కేసును ఛేదించిన పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్న 10వ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. దొంగతనానికి వెళ్లిన సమయంలో బాలికను చూసి హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.