News August 22, 2025
HYD: వింటూనే ఉన్నాం.. ఎప్పుడు చూస్తామో!

ప్రత్యేక తెలంగాణ వచ్చి నేటికి 11ఏళ్ల 2 నెలల 20 రోజులైంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఓ పదం వింటూనే ఉన్నాం.. ‘మూసీని అభివృద్ధి చేస్తాం’ అని. ఈ పదం వినీ.. వినీ నగరవాసికి విసుగెత్తిపోయింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇపుడు కాంగ్రెస్ సర్కార్‌కు ఈ పదం పలకడం అలవాటైపోయింది. మూసీని అభివృద్ధి చేయకుండా.. చేస్తాం, చేస్తాం అని ఇంకెన్నేళ్లు చెబుతారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 16, 2026
కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి స్థలం గుర్తించండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 చోట్ల విమానాశ్రయాలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అక్కడ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆ ప్రాంతాలను తిరస్కరించిందని, భద్రాచలం, కొత్తగూడెం, మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుకూలమైన భూమిని గుర్తించాలని కలెక్టర్ అంకిత్‌ను ఆదేశించారు. దీనిపై సంబంధిత శాఖలు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.
News March 16, 2026
బీఆర్ఎస్ నేతలతో జీవన్ రెడ్డి చర్చలు

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశాలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ చర్చల తరువాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో చర్చలు జరిగినట్లు సమాచారం.
News March 16, 2026
వడదెబ్బ నివారణపై అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ

వడదెబ్బ నివారణపై బాపట్లలోని కలెక్టర్ అవగాహన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదన్నారు. తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.


