News August 22, 2025

10,270 క్లర్క్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

IBPS క్లర్క్ పోస్టులకు నిన్నటితో దరఖాస్తు గడువు ముగియగా దాన్ని ఆగస్టు 28 వరకు పొడిగించారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో మొత్తం 10,270 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. ఏపీలో 367, తెలంగాణలో 261 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లై కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.
>>SHARE IT

Similar News

News August 22, 2025

నేను చనిపోలేదు: నటుడు

image

తాను చనిపోలేదంటూ బాలీవుడ్ నటుడు రజా మురాద్ ఏకంగా పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. తన మరణంపై SMలో దుష్ప్రచారం జరుగుతోందని, ఇది చూసి ఫ్యాన్స్ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారని వాపోయారు. తన మృతిపై వస్తున్న వదంతులపై స్పష్టతిస్తూ అలసిపోయానని, ఇది తీవ్రమైన విషయమన్నారు. ఇలా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై అంబోలి పోలీసులను కోరారు. రజా మురాద్ ఇంద్రలో విలన్‌గా మెప్పించారు.

News August 22, 2025

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

image

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఇది చట్టం కానుండగా, ఉల్లంఘించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.కోటి జరిమానా లేదా రెండూ విధించవచ్చు. రూల్స్ ఉల్లంఘించి ప్రకటనలు ఇచ్చే వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.50లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. ఆన్‌లైన్ గేమింగ్ మోసాలు నివారించేలా కేంద్రం దీనిని తీసుకొచ్చింది.

News August 22, 2025

కొత్త సినిమాలో చిరంజీవి మరో లుక్ చూశారా?

image

చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నుంచి మరో లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇవాళ ఉదయం విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇదే ఉత్సాహంలో సెకండ్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఇందులో కుర్చీలో స్టైల్‌గా కూర్చున్న చిరు సిగరెట్ తాగుతూ కనిపించారు. ఈ కొత్త పోస్టర్ సైతం అభిమానులను ఆకట్టుకుంటోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.