News August 22, 2025
అక్షయ్ కుమార్ హెల్త్ సీక్రెట్ ఇదే

బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ తన హెల్త్ సీక్రెట్‌ను రివీల్ చేశారు. రోజూ 6.30PMలోపు భోజనం చేస్తానని ఆయన తెలిపారు. అలాగే ప్రతి సోమవారం ఉపవాసం ఉంటానని, ఆదివారం సాయంత్రం భోజనం చేసిన తర్వాత మళ్లీ మంగళవారం ఉదయం తింటానని వెల్లడించారు. అయితే సూర్యాస్తమయానికి ముందే భోజనం చేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుందని, జీవక్రియ పెరుగుతుందని, రక్తంలో చక్కెర స్థాయులు సమతుల్యమవుతాయని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News August 22, 2025
కేసీఆర్‌కు స్వల్ప అనారోగ్యం?

TG: బీఆర్ఎస్ అధినేత KCR స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు విశ్వసనీయ సమాచారం. హరీశ్‌రావుతో పాటు పలువురు ముఖ్య నేతలు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయన్ను పరామర్శించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశంపైనా వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గత నెలలో కేసీఆర్ అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో కొన్నిరోజులు చికిత్స పొందిన విషయం తెలిసిందే.
News August 22, 2025
ముగిసిన నామినేషన్ల పరిశీలన.. బరిలో ఇద్దరే!

ఉపరాష్ట్రపతి ఎన్నికలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. పలువురు దాఖలు చేసిన నామినేషన్లను స్క్రూటినీ చేశారు. అనంతరం ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఇద్దరే బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఎన్టీఏ కూటమికే అత్యధిక మంది ఎంపీలు ఉండటంతో రాధాకృష్ణన్ గెలుపు లాంఛనం కానుంది.
News August 22, 2025
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మళ్లీ కూనంనేని

TG: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు మరోసారి ఎన్నికయ్యారు. HYD గాజులరామారంలో జరిగిన సీపీఐ 4వ రాష్ట్ర మహాసభల్లో ఆయన పేరును పార్టీ నేత వెంకట్‌రెడ్డి ప్రతిపాదించగా, మరో నేత శంకర్ బలపరిచారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సాంబశివరావు ప్రస్తుతం కొత్తగూడెం MLAగా ఉన్నారు.