News August 22, 2025
శ్రీశైలంలో వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం

శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమానికి వేలాది మహిళలు హాజరయ్యారు. ఆలయ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతం చేయించారు. వరలక్ష్మి వ్రతం అనంతరం భక్తులకు భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి ప్రసాదాలు అందజేశారు.
Similar News
News March 19, 2026
20వ రోజుకు యుద్ధం.. 2వేలకుపైగా మరణాలు!

అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ పోరు ప్రారంభమై నేటికి 20 రోజులు. పశ్చిమాసియాకు పాకిన ఈ యుద్ధంతో చమురు సంక్షోభం నెలకొనగా.. మరణాల సంఖ్య 2000 దాటింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్‌లో ఇప్పటివరకు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో 850 మంది, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల్లో 13 మంది చనిపోగా మరో 13 మంది US సర్వీస్ మెంబర్స్ కూడా మృతిచెందారు.
News March 19, 2026
నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు

అనకాపల్లి పట్టణం గవరపాలెం నూకాంబిక అమ్మవారి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరితో పాటు జేసీ సౌర్యమాన్ పటేల్, ఆర్డీవో షేక్ ఆయిషా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.
News March 19, 2026
CSKకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం

మరో 9 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSK జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్(AUS) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని CSK CEO విశ్వనాథన్ తాజాగా ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ఆయన స్థానంలో వేరే బౌలర్ కోసం చూస్తున్నామన్నారు. డెత్ ఓవర్లలో ఎల్లిస్ కీలక బౌలర్ అని, ఆయన దూరమవడం తమకు పెద్ద దెబ్బ అని విశ్వనాథన్ పేర్కొన్నారు.


