News August 22, 2025
ఈ నెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

AP: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులు ప్రింటింగ్ కార్యాలయాల నుంచి మండలాలకు చేరాయి. ఈ నెల 25 నుంచి కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు అందజేయనున్నారు. దీనిపై కార్డుదారు ఫొటో, కుటుంబసభ్యుల వివరాలు ఉంటాయి. కొత్తగా స్మార్ట్ ఈ-పోస్ మెషీన్లనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.
Similar News
News August 22, 2025
ఎవరా లీకువీరుడు..?

TG సెక్రటేరియట్‌లో కొందరు హై లెవల్ అధికారులకు టెన్షన్ పట్టుకుంది. దీనికి కారణం.. PC ఘోష్ కమిషన్ రిపోర్టును KCR కోర్టులో సవాల్ చేయడం. కాళేశ్వరంపై ఘోష్ ఇచ్చిన 600పేజీల నివేదికను ప్రభుత్వం ప్రజలకు 60పేజీల సమ్మరీ రిపోర్టుగా రిలీజ్ చేసింది. అయితే KCR 600పేజీల కాపీతో HCకి వెళ్లడంతో ఆయనకు కాపీ ఎవరిచ్చారని CMO విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత IASలు ఆందోళనలో పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
News August 22, 2025
నటుడికి భార్య విడాకులు?

నటుడు గోవింద-సునీత ఆహుజా దంపతులు విడాకులు తీసుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాలు మరోసారి కోడై కూస్తున్నాయి. భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ బాంద్రా ఫ్యామిలీ కోర్టులో సునీత విడాకులకు అప్లై చేసినట్లు తెలిపాయి. భర్త తనను వేధిస్తున్నాడని, మోసం చేశాడని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నట్లు వెల్లడించాయి. కాగా గతంలోనూ వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరగగా సునీత <<15621494>>ఖండించారు<<>>. ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.
News August 22, 2025
PHOTO: కాబోయే కోడలితో సచిన్ ఫ్యామిలీ?

సచిన్ కొడుకు అర్జున్‌కు సానియా చందోక్‌తో ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు సచిన్ దీనిపై స్పందించలేదు. ఇవాళ ముంబైలో సారా తెందూల్కర్ ఫిట్‌నెస్ సెంటర్ ఓపెనింగ్‌కు సానియా హాజరయ్యారు. తెందూల్కర్ ఫ్యామిలీతో కలిసి ఆమె సెంటర్‌ను ప్రారంభించడం ఎంగేజ్మెంట్ వార్తలకు బలం చేకూరుస్తోంది. తర్వాత వారంతా కలిసి ఫొటోలు దిగారు. వీటిని స్వయంగా సచినే Xలో షేర్ చేశారు.