News August 22, 2025
ఫేక్ ప్రచారం చేసే కఠిన చర్యలు తప్పవు: ఖమ్మం సీపీ

ఫేక్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఓ దిన పత్రికకు అర్ధం వచ్చేలా డేట్ లైన్ మార్ఫింగ్ చేసి తప్పుడు వార్త కథనాన్ని ప్రముఖ దిన పత్రికలో వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుపై ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 13, 2026
‘ప్రజలు అందించే ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి’

ప్రజలు అందించే ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు పీ.శ్రీజ, పీ.శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం పరిశీలన, పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News April 13, 2026
రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రేపు మార్కెట్‌లో అన్ని రకాల క్రయవిక్రయాలు నిలిపివేయబడతాయని పేర్కొన్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని, రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని మార్కెట్ పాలకవర్గం ఒక ప్రకటనలో కోరింది.