News August 22, 2025
ధన్వాడ: నాణ్యతతో పనులు చేపట్టాలి- కలెక్టర్

నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజ చేశారు. పనుల జాతర కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో రెండు అంగన్వాడీ భవనాల నిర్మించనున్నట్లు తెలిపారు. మండలంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. మాధవరెడ్డి, సదాశివరెడ్డి ఉన్నారు.
Similar News
News March 14, 2026
ఇరాన్‌పై దాడులు.. 2 వారాల్లో 2,000 మంది మృతి!

ఇరాన్‌పై US&ఇజ్రాయెల్ గత 2 వారాలుగా జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ 2వేల మందికి పైగా చనిపోయారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ఈ యుద్ధంలో మరణించిన అమెరికన్ సైనికుల సంఖ్య 11కి చేరింది. ఈ లిస్టులో వెస్టర్న్ ఇరాక్‌లో క్రాష్ అయిన రీఫ్యుయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిబ్బంది ఆరుగురు కూడా ఉన్నారు. ఇక తమ దేశంపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 100+ మంది పిల్లలు మరణించినట్లు లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.
News March 14, 2026
వేసవిలో నీటి ఎద్దడి నివారించేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో వేసవిలో నేటి ఎద్దడి నివారించేలా చర్యలు తీసుకోవడంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నీతియొద్దని గుర్తించి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తూ నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News March 14, 2026
WGL: మొండి బకాయిదారులకు నోటీసులు

వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్ను మొండి బకాయిదారులకు ఆర్పీల ద్వారా నోటీసులు పంపిణీ చేయిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో గత రెండేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించని 19 వేల మంది మొండి బకాయిదారులు ఉన్నారు. మెప్మా ఆర్పీల ద్వారా వారందరికీ కార్పొరేషన్ అధికారులు రెడ్ నోటీసులు అందించి సంతకాలు తీసుకుంటున్నారు. ఈ నెలాఖరుతో పన్ను చెల్లింపు గడువు ముగుస్తుండటంతో ఆర్పీల సేవలను తీసుకుంటున్నారు.


