News August 22, 2025
ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు: మంత్రి శ్రీనివాస్

AP: ప్రభుత్వం పెన్షన్లను తొలగిస్తోందన్న YCP ఆరోపణలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. ’15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు. 65 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం. గతంలో కొందరు నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందుకే 80వేల మందికి నోటీసులు ఇచ్చాం. తగిన సర్టిఫికెట్ చూపిస్తే పెన్షన్ వస్తుంది. 9నెలల నుంచి పెన్షన్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతోంది’ అని తెలిపారు.
Similar News
News March 21, 2026
ముస్లింల వస్తువులు వద్దన్నారు.. క్రూడాయిల్ ఎందుకు కొంటున్నారు: అసద్

TG: దేశంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలు తయారుచేసే వస్తువులు కొనవద్దని తీర్మానం చేసిన బీజేపీ అరబ్ దేశాల నుంచి క్రూడాయిల్ ఎందుకు కొనుగోలు చేస్తోందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి భారత్‌లో అన్ని వర్గాల కోసం పని చేస్తున్నామని చెప్తుండటం పచ్చి అబద్ధమన్నారు. దేశంలో గ్యాస్, పెట్రోలియం కొరత ఉన్నా అలాంటిదేం లేదని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
News March 21, 2026
పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో LPG <<19316911>>గ్యాస్<<>>, పవర్ పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెగ్యులర్ పెట్రోల్ విషయంలో ఆందోళన నెలకొంది. సాధారణ వాహన ఇంధన ధరలను <<19436412>>పెంచబోమని<<>> IOCL ప్రకటించింది. కానీ పలు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రేట్లు పెరుగుతాయని తెలుస్తోంది. పెట్రోల్‌పై ₹10-15, డీజిల్‌పై ₹10 వరకు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News March 21, 2026
ఉదయాన్నే కాఫీ/టీ తాగితే..

కాఫీ, టీ తాగితే మంచిదా? కాదా? అనే అంశంపై విభిన్న ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా USకు చెందిన హార్వర్డ్, MIT సైంటిస్టులు ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఉదయాన్నే కెఫిన్ ఉన్న కాఫీ/టీని మితంగా తీసుకుంటే డిమెన్షియా(మతిమరుపు) ప్రమాదం 18% తగ్గుతుందని పేర్కొన్నారు. స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. 43 ఏళ్లలోపు వయసున్న 1,31,821 మంది డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని తెలిపారు.


