News August 22, 2025
జగన్ పథకాలను కాపీకొట్టడమే చంద్రబాబుకు తెలుసు: కాకాణి

CM చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని, YCP అధినేత జగన్ పథకాల్ని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. కీలక సమయంలో ఎరువులు అందలేదు. YCP ప్రభుత్వం RBKల ద్వారా అన్నీ సమకూర్చాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసింది’ అని అన్నారు.
Similar News
News August 23, 2025
తాడేపల్లిలో కాకాణితో ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి భేటీ

తాడేపల్లిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలు చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు. జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలపై మాట్లాడుకున్నారు.
News August 22, 2025
నెల్లూరు వ్యవసాయ ప్రయోగశాలకు జాతీయ స్థాయి గుర్తింపు

నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎరువులు, సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. రైతులకు ఎరువుల నాణ్యత, నేల సారవంతంపై మెరుగైన సలహాలు అందిస్తున్నందుకు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నెల్లూరు అగ్రికల్చర్ ల్యాబ్‌కు జాతీయస్థాయి గుర్తింపు రావడంతో కలెక్టర్ ఆనంద్ వారిని అభినందించారు.
News August 22, 2025
నెల్లూరు: రౌడీషీటర్‌కు లెటర్లు ఇవ్వడం ఏంటి?

నెల్లూరు రూరల్, గూడూరు MLAలు కోటంరెడ్డి, సునీల్ కుమార్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. శ్రీకాంత్ పెరోల్‌కు తాము ఇచ్చిన సిఫార్స్ లెటర్లు తిరస్కరించారని.. ఆ వివాదంతో తమకు సంబంధం లేదని MLAలు అంటున్నారు. లెటర్లు రిజెక్షన్ సరే.. అసలు జైలు నుంచి నేరస్థుడిని విడుదల చేయడానికి సిఫార్స్ చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. మంచి పనులకు లెటర్లు ఇవ్వాల్సిన MLAలు రౌడీషీటర్ కోసం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.