News August 22, 2025
స్వచ్ఛ ఆంధ్ర ఉద్దేశ్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా 4వ శనివారం జరగనున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమ ఉద్దేశ్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఛాంబర్ నుంచి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమ నిర్వహణ, అవార్డులపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రతీ నెలా ఒక నినాదంతో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
Similar News
News March 22, 2026
ADB: ఈ నెల 27 నుంచి కందుల కొనుగోలు బంద్

కేంద్ర ప్రభుత్వ సంస్థ (నాఫేడ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (మార్క్ ఫెడ్) కందుల కొనుగోలు చేయడానికి ఈ నెల 26 వరకు అవకాశం ఉందని మార్క్ ఫెడ్ మేనేజర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌లలో కందుల కొనుగోలు నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు 27 నుంచి తమ కందులను మార్కెట్ యార్డ్‌లకు తీసుకురావద్దని సూచించారు.
News March 22, 2026
హన్మకొండ: 11 మందిలో గెలిచింది ఒక్కడే!

తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ పోటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 11 మంది న్యాయవాదులు బరిలో నిలిచారు. ఇందులో సీనియర్ న్యాయవాది ఎం సహోదర రెడ్డి మాత్రమే విజయం సాధించారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో న్యాయవాది సహోదర్ రెడ్డి 1085 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. సహోదర్ రెడ్డి విజయంతో వరంగల్ కోర్టులో సంబరాలు నెలకొన్నాయి.
News March 22, 2026
ఈ గ్రామంలో వర్షమే కురవదు!

యెమెన్‌లోని అల్ హుతైబ్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత వింతైన ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,200 మీటర్ల ఎత్తున పర్వత శిఖరంపై ఉండటం వల్ల ఇక్కడ అసలు వర్షమే కురవదు. మేఘాలన్నీ ఈ గ్రామం కంటే తక్కువ ఎత్తులోనే ఏర్పడటం వల్ల వర్షం పడదు. అందుకే దీనిని ‘డ్రై సిటీ’ అని పిలుస్తారు. ఇక్కడ మేఘాలు చేతికి తాకే ఎత్తులోనే ఉండటం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో


