News August 22, 2025
రాజంపేట: అయ్యో పాపం..!

ఆ 8మంది సరదాగా ఈతకు వెళ్లారు. సంతోషంగా గడుపుతున్న వేళ ప్రమాదం దరి చేరింది. కళ్ల ముందే స్నేహితులు నీటిలో మునిగిపోయారు. ఒకదాని తర్వాత మరొక మృతదేహాలను వెలికి తీసి ఒడ్డున వేస్తుంటే ఆపుకోలేని దుఃఖంతో కుమిలిపోయారు. ఎదిగొచ్చిన బిడ్డలు విగతజీవులుగా మారిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బోరున విలపించారు. చెయ్యేరు నదిలో ముగ్గురు విద్యార్థుల <<17476364>>మృతికి <<>>సంబంధించిన విషాద గాథ ఇది.
Similar News
News August 22, 2025
NLG: సిలిండర్ పేలి వ్యక్తి మృతి

చింతపల్లి మండలంలోని తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో నిద్రిస్తున్న గార్లపాటి రాములు అనే వ్యక్తి మృతి చెందాడు. సిలిండర్ పేలుడు ధాటికి ఇళ్లు పూర్తిగా కూలిపోయింది. చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News August 22, 2025
VJA: దసరా ఉత్సవాల భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన CP

విజయవాడలో జరగబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు శుక్రవారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించినట్లు సీపీ పేర్కొన్నారు.
News August 22, 2025
భూగర్భ జలాలు పెరిగేలా ప్రణాళికల తయారీ: కలెక్టర్

ప్రకాశం జిల్లాలో భూగర్భ జలమట్టం మరింత పెరిగేలా గ్రామస్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం భూగర్భ జల వనరులశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. 20 మీటర్లకంటే ఎక్కువ భూగర్భ జలమట్టం ఉన్న గ్రామాల్లో, జలమట్టం పెరిగే అవకాశంపై ప్రణాళికలు రూపొందించాలన్నారు.