News August 22, 2025
లైసెన్స్ లేని కేబుళ్లన్నీ తీసేయండి: హైకోర్టు

TG: హైదరాబాద్‌లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్‌టెల్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచవద్దని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా కేబుళ్లు ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. కాగా ఇటీవల Dy.CM భట్టి ఆదేశాలతో HYDలో కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News August 22, 2025
భారత్‌కు మద్దతు.. అమెరికా మాజీ NSA ఇంట్లో తనిఖీలు

INDపై ట్రంప్ టారిఫ్‌లను తప్పుబట్టిన US మాజీ జాతీయ భద్రతా సలహాదారు(NSA) జాన్ బోల్టన్ ఇంట్లో FBI తనిఖీలు చేపట్టింది. INDకు మద్దతు తెలిపిన మరునాడే ఇలా జరగడం గమనార్హం. తమ అధికారులు విధులు నిర్వర్తించారని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని FBI డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. తనిఖీలు జరుగుతున్నా జాన్ వెనక్కి తగ్గలేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఉక్రెయిన్-రష్యాతో భేటీలు అవుతూనే ఉంటారని విమర్శించారు.
News August 22, 2025
త్వరలో అసెంబ్లీ సమావేశాలు!

TG: త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జరిగే క్యాబినెట్ భేటీలో తేదీలు ఖరారు చేస్తారని విశ్వసనీయ సమాచారం. సమావేశాల సందర్భంగా కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక గురించి ముఖ్యంగా చర్చ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
News August 22, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు, ఆగస్టు 25 నాటికి ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.