News August 22, 2025

SSS: నూతన బార్ పాలసీకి నోటిఫికేషన్ విడుదల

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 12 బార్ల ఏర్పాటుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ధర్మవరం 03, హిందూపూర్ 04, కదిరి 03, పెనుకొండ 01, మడకశిరలో 01 కొత్త బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి గోవింద నాయక్ శుక్రవారం తెలిపారు. అమ్మకాల సమయాన్ని పెంచుతూ నిర్ణయించామన్నారు. ఈనెల 26 వరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News March 14, 2026

ఓటర్ల మ్యాపింగ్‌ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం సీఈఓ సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

News March 14, 2026

సొంత ఊరిలో ‘బ్యాండ్‌ మేళం’ దర్శకుడికి ఘన స్వాగతం

image

‘బ్యాండ్‌ మేళం’ చిత్ర దర్శకుడు జవ్వాజి సతీష్‌ తన సొంత గ్రామమైన ఇబ్రహీంపట్నంకు చేరుకోవడంతో గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం సర్పంచ్ బద్దం గోపి, ఉపసర్పంచ్ నాంపెల్లి రమేష్‌, ఆయన చిన్ననాటి స్నేహితులు సతీష్‌ను ఘనంగా సత్కరించారు. సతీష్‌ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీసి ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా ఎదగాలని గ్రామస్థులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, మిత్రులు పాల్గొన్నారు.

News March 14, 2026

మా డ్రెస్సింగ్‌తో మీకేంటి సమస్య: రాశీ ఖన్నా

image

కంఫర్ట్‌గా ఉండే దుస్తులు ధరించే స్వేచ్ఛ ఏ అమ్మాయికైనా ఉంటుందని హీరోయిన్ రాశీ ఖన్నా అన్నారు. ‘ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది అమ్మాయి ఇష్టం. మేము ఏ దుస్తులు ధరిస్తే మీకేంటి సమస్య’ అని ప్రశ్నించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్లలో ఆమె పాల్గొన్నారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై <<18746820>>చర్చ జరగడాన్ని<<>> ప్రస్తావించగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని, పెళ్లికి ఇప్పుడు సమయం లేదని చెప్పారు.