News August 22, 2025

పెన్షన్‌దారులకు మరో అవకాశం: కలెక్టర్

image

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వెరిఫికేషన్‌లో తొలగించిన దివ్యాంగుల పింఛన్ దారులకు మరో అవకాశం కల్పిస్తామన్నారు. దీనిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News March 19, 2026

కాకినాడ: పులి.. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉందంటే?

image

నిన్నటివరకు కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి బుధవారం రాత్రి పోలవరం జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు నిర్ధారించారు. రాజవొమ్మంగి మండలంలోని కొండ లింగంపర్తి, కొత్తపల్లి గ్రామాల సమీపంలో అటవీప్రాంతంలో బుధవారం రాత్రి పులి సంచరించినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం పులి బోర్నగూడెం సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.

News March 19, 2026

విశాఖ: స్టీల్ ప్లాంట్‌కు ఊరట.. ఎల్పీజీ సరఫరా పునఃప్రారంభం

image

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఎల్పీజీ సరఫరా తిరిగి ప్రారంభమైంది. వారం రోజుల అంతరాయంతో ఉత్పత్తిపై ఆందోళన నెలకొంది. స్టీల్ మెల్టింగ్ షాప్‌లో కంటిన్యూస్ కాస్టింగ్ మెషీన్స్ (CCM)లకు రోజుకు 12-13 టన్నుల ఎల్పీజీ అవసరం. ప్లాంట్‌లోని 325 టన్నుల సామర్థ్యం ఉన్న ట్యాంకుల్లో నిల్వలు 75 టన్నులకు తగ్గాయి. యాజమాన్యం, యూనియన్ల ఒత్తిడితో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సరఫరా నిన్నటి నుంచి పునఃప్రారంభం అయ్యింది.

News March 19, 2026

పరాభవ నామ సంవత్సరం.. శుభ ముహూర్తాలు

image

* చైత్ర మాసం- మార్చి 27, 28
* వైశాఖ మాసం- ఏప్రిల్ 26, 29, మే 1, 3, 6-11
* నిజ జ్యేష్ఠ మాసం: జూన్ 17-జులై9
* శ్రావణ మాసం: ఆగస్టు 15, 16, 20, 22
* కార్తీక మాసం: నవంబర్ 12-22,
* మాఘ మాసం: 2027 ఫిబ్రవరి 7-27
* ఫాల్గుణ మాసం: మార్చి 10-ఏప్రిల్ 2
* గురు మౌఢ్యమి: జులై 15- ఆగస్టు 15, శుక్ర మౌఢ్యమి: అక్టోబర్ 19-29 వరకు ముహూర్తాలు లేవు.#ShareIt