News August 22, 2025

ప్రకాశం: ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

సెప్టెంబర్ 5న జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, హెచ్‌యంలు తమ పరిధిలోని ఎంఈఓలకు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. డిప్యూటీ DEOలు 25లోగా వాటిని పరిశీలించి 27న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.

Similar News

News March 19, 2026

ప్రకాశం: ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 42 దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల (గ్రూప్-4: 12, క్లాస్-4: 30) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్ పోస్ట్‌లు ఉన్నాయి. అర్హులైన వారు ఏప్రిల్ 8 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.prakasam.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, దరఖాస్తులను ఒంగోలు కలెక్టరేట్‌లో సమర్పించాలని కలెక్టర్ రాజబాబు తెలిపారు.

News March 19, 2026

ఒంగోలు: విధుల్లో గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్

image

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పనిచేస్తున్న ఎక్సైజ్ కార్యాలయ కానిస్టేబుల్ కందుల రాఘవరావు విధుల్లో ఉండగా మృతి చెందారు. సెంట్రీ డ్యూటీలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో బుధవారం ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు కాగా మృతదేహాన్ని అక్కడికి తరలించారు. ఐదు నెలల క్రితం ఈయన ఆత్మకూరుకు బదిలీపై వచ్చారు. ఆఫీసులోనే చనిపోవడంతో సహచర ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

News March 19, 2026

మార్కాపురం కలెక్టరేట్‌లో ఈనెల 19న ఉగాది వేడుకలు

image

మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 19న ఉగాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అధికారులు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.