News August 22, 2025

టేకులపల్లిలో రూ.2.12 కోట్ల గంజాయి పట్టివేత

image

ఇల్లందు DSP ఆదేశాల మేరకు టేకులపల్లిలోని వెంకిట్యాతండ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. లారీపై అనుమానం వచ్చి తనిఖీచేయగా రూ.2.12 కోట్ల విలువ గల 424 కిలోల గంజాయి లభ్యమైంది. లారీలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. రాజస్థాన్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు నేరం ఒప్పుకున్నారని DSP తెలిపారు. వారి నుంచి 2 సెల్‌ఫోన్‌లు, గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.

Similar News

News March 16, 2026

HYDలో అంతా మా ఇష్టం!

image

HYDలో గ్యాస్ కొరత వార్తలు సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది. బషీర్‌బాగ్‌లోని ఫుల్‌బాగ్‌ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ ధరలు పెరిగాయనే నెపంతో ప్రతి ఫుడ్ ఐటమ్ మీద అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా పెంచుతోన్న ధరలతో సామాన్య ప్రజలు వాపోతున్నారు. కట్టడి చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.

News March 16, 2026

‘మధుబాల’గా మెప్పించనున్న సాయిపల్లవి?

image

‘ఏక్ దిన్’ సినిమాతో <<19355627>>బాలీవుడ్‌లో<<>> అడుగుపెట్టనున్న సాయి పల్లవి మరో హిందీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించనున్న అలనాటి బ్యూటీ క్వీన్ మధుబాల బయోపిక్ కోసం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణ మూవీతోపాటు ధనుష్ సినిమాతో బిజీగా ఉన్నారు.

News March 16, 2026

కామారెడ్డి అభివృద్ధిపై రాజకీయ చర్చ..!

image

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పని తీరుపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రులను కలవకుండా కేంద్ర మంత్రులను మాత్రమే కలుస్తున్నారని ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. కామారెడ్డి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం అవసరమని, రాష్ట్ర మంత్రులను కలిసి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.