News August 22, 2025

జానపదమా జనంలో ఉండిపో..!

image

జానపద కళలకు తెలుగు భూమి పండిన పంట పొలం వంటిది. బాపట్ల జిల్లాలోని జానపదులు జి.వెంకటశివయ్య బుర్రకథ దళం, యల్లమంద జంగం కథకుడు, తమ్మారపు వెంకట స్వామి వీధి నాటకాలు ఆడేవారు. దొడ్డారపు వెంకట స్వామి ఆ రోజుల్లో గొప్ప జంగం కథా గాయకుడిగా వెలుగొందారు. వీరు అనేక కళారూపాలను చేపట్టి ప్రజలను ఐక్యం చేశారు. నెమలి నృత్యం, తోలుబొమ్మలు, కోలాటం వంటివి జిల్లాలో ప్రత్యేకత సంతరించుకున్నాయి. నేడు ప్రపంచ జానపద దినోత్సవం.

Similar News

News March 22, 2026

రేపటి ప్రజావాణికి సకాలంలో హాజరు కావాలి: కలెక్టర్

image

మార్చి 23వ తేదీ సోమవారం భద్రాద్రి కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

News March 22, 2026

తాగునీటి ఎద్దడి రానీయొద్దు: పద్మశ్రీ ఆదేశం

image

ఏలూరు జిల్లాలో వేసవి దృష్ట్యా తాగునీటి కొరత తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని ఉమ్మడి జడ్పీ చైర్‌పర్సన్ పద్మశ్రీ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఏలూరు జడ్పీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 557 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో ఇప్పటికే అధికశాతం నీటితో నింపినట్లు తెలిపారు. మిగిలిన మంచినీటి చెరువులను కూడా తక్షణమే పూర్తిస్థాయిలో నింపాలన్నారు.

News March 22, 2026

పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకండి: CM

image

TG: పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపాలనే మోజు నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని CM రేవంత్ సూచించారు. ‘వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తున్నాం. ఇవి నర్సరీ నుంచి ప్రారంభం అవుతాయి. పాలు, బ్రేక్‌ఫాస్ట్ కూడా అందిస్తాం. ప్రైవేట్ కంటే గవర్నమెంట్ టీచర్లే ప్రతిభావంతులు. అన్ని ప్రభుత్వ స్కూళ్లను ప్రక్షాళన చేస్తాం. అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా’ అని సిద్దిపేటలో తెలిపారు.