News August 22, 2025

కూకట్‌పల్లి: సహస్ర హత్య.. బాలుడు రాసిన పేపర్ ఇదే!

image

సహస్ర హత్య కేసులో బాలుడికి సంబంధించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఆ ఇంట్లోకి వెళ్లే ముందు ఎలా వెళ్లాలి? ఏం చేయాలి? అనేదానిపై పూర్తిగా పేపర్ పైన రాసుకొని మరీ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పేపర్‌‌లో లాస్ట్‌‌ లైన్ మిషన్ కంప్లీటెడ్‌ అని రాసుకొన్న బాలుడి ఆలోచన విధానం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. పదేళ్ల బాలుడి మైండ్‌సెట్ ఇలా ఉండటం పట్ల అంతా నివ్వెరపోతున్నారు.

Similar News

News March 9, 2026

మిడిల్ ఈస్ట్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం: జైశంకర్

image

మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై MEA జైశంకర్ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. అక్కడి పరిణామాలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నా నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మన ఇంధన అవసరాల విషయంలో మిడిల్ ఈస్ట్ కీలకమన్నారు. క్రూడాయిల్ ధర పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. టెహ్రాన్‌లోని భారతీయ ఎంబసీ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు.

News March 9, 2026

HYD: చెత్త కనిపిస్తే వాట్సాప్ చేయండి

image

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ప్రజలు కార్యాలయాల దాకా రాకుండానే పారిశుద్ధ్య సమస్యలు తెలియజేసేందుకు వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. రోడ్లపై చెత్త పేరుకుపోయినా, చెత్త బిన్లు నిండిపోయినా, నాలాల్లో వ్యర్థాలు ఉన్నా ఫొటో తీసి, లొకేషన్‌తో వాట్సాప్ నంబర్‌కు పంపాలన్నారు. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి
GHMC: 8125966586
మల్కాజిగిరి: 9063421300
సైబరాబాద్: 9063421347