News August 22, 2025

VZM: రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

image

విజయనగరం జిల్లాలో ఎరువులకు కొర‌త లేద‌ని, స‌రిప‌డి నంత స్టాక్ సిద్దంగా ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ తెలిపారు. రైతులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. శుక్రవారం తన ఛాంబర్‌లో సమీక్ష జరిపారు. ప్రస్తుతం ఉన్నవివిధ పంటలకు గాను 36,740 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 25,605 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని చెప్పారు. 3వేల టన్నుల యూరియా అవ‌స‌రం ఉంటుంద‌న్నారు.

Similar News

News March 8, 2026

VZM: రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

image

విజయగరం జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
➤VZM–సంబల్‌పూర్ 3వ లైన్ పనులకు వారంలో విత్‌డ్రావల్ ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశం ➤కొత్తవలస–VZM 4వ లైన్ పనులకు గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం
➤ఖుర్దా రోడ్–VZM 3వ లైన్‌కు స్ట్రక్చర్ వ్యాల్యూయేషన్ రిపోర్టులు సిద్ధం చేయాలని ఆదేశం
➤జిల్లాలో మంజూరైన 17 ROB పనులపై ఆరా

News March 8, 2026

VZM: కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని 26 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డా. ఎ. రామారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో కొత్త ప్రవేశాలు ఉండగా, 7 నుంచి 10, ఇంటర్‌లోని తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నామన్నారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News March 8, 2026

పోలీస్ పరేడ్‌లో మహిళ దినోత్సవం: కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం పోలీస్ పరేడ్‌లో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిపాలన యంత్రాంగం, డీఆర్‌డీఏ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానిస్తామన్నారు.