News August 22, 2025
ఆర్మూర్: ‘ప్రైవేట్ పాఠశాలకు నోటీసులు జారీ చేశాం’

ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు జారీ చేసే ట్రాన్స్‌ఫార్మర్ సర్టిఫికెట్‌కి డబ్బులు వసూలు చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు ఆ పాఠశాలకు నోటీసులు జారీ చేశామని మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారం ఈరోజు తెలిపారు. ఫీజుల పెండింగ్, టీసీ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Similar News
News April 1, 2026
NZB: ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బారికేడ్ల అందజేత

నిజామాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బారికేడ్లను, హోర్డింగులను అందజేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా వాటిని ఇచ్చారు. బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించేలా బారికేడ్లు, హోర్డింగులు అందజేయడం అభినందనీయమన్నారు.
News April 1, 2026
NZB: కొండగట్టు పనుల్లో ఇంత నిర్లక్ష్యమా?: కవిత

కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలి 15 మంది గాయపడిన ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విచారం వ్యక్తం చేశారు. హనుమాన్ జయంతి వేడుకల కోసం నాసిరకంగా పందిళ్లు వేయడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొండగట్టు అంజన్న ఆలయంలో ఉత్సవాల సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.