News August 22, 2025

కొత్తగూడెం: ‘నూతన తరగతి గదులు నిర్మించాలి’

image

కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన తరగతి గదులు నిర్మించాలని SFI జిల్లా అధ్యక్షుడు మంద నాగక్రిష డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కళాశాలలో ఒకేషనల్ తరగతి గదులు, ఆర్ట్స్ విభాగం తరగతి గదులు శిథిలావస్థకు చేరాయని, వాటి స్థానంలో నూతన తరగతి గదులు నిర్మించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 9, 2026

11 రోజుల్లో నాన్‌స్టాప్‌గా 13వేల కిలోమీటర్ల జర్నీ!

image

B6 అనే 4 నెలల బార్ టెయిల్డ్ గాడ్‌విట్ పక్షి‌కి 11 రోజుల్లోనే నిర్విరామంగా 13,560km ప్రయాణించిన ప్రపంచ రికార్డ్ ఉంది. జర్నీకి ముందు అలాస్కాలో ఎక్కువ ఆహారం తిని కొవ్వును పెంచుకుంది. ప్రయాణంలో అవయవాల సైజ్‌ను తగ్గించుకొని కొవ్వును కరిగించుకుంటూ శక్తిని తెచ్చుకునేది. ఎగురుతూనే మెదడులో సగభాగాన్ని అలర్ట్‌గా ఉంచి నిద్రపోయేది. భూఅయస్కాంత శక్తి ఆధారంగా దిక్కులు గుర్తిస్తూ మెరుగైన ఆహారం కోసం AUS చేరుకుంది.

News March 9, 2026

జగిత్యాల: ‘కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

image

ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా మధ్యాహ్నం భోజనం కార్మికులకు బిల్లును చెల్లించాలని కోరారు. ప్రతి విద్యార్థికి మెస్ చార్జీ రూ. 25 చొప్పున చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెన్న మహేష్, సరస్వతి, సావిత్రి, శారద, పద్మ పాల్గొన్నారు.

News March 9, 2026

HYD: పట్టాల మాటున ప్లాట్ల వ్యాపారం!

image

రైలు పట్టాల కింద ఉన్న భూములే మెట్రో ఫేట్ డిసైడ్ చేస్తున్నాయా? 2వ దశ విస్తరణలో అలైన్‌మెంట్ మార్పుల వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. JAN 2026లో ప్రభుత్వం ₹2,787 కోట్ల భూసేకరణ నిధులను కేటాయించింది. ఎయిర్‌పోర్ట్, ఫోర్త్ సిటీ మెట్రో రూట్లను పదేపదే మార్చడంతో ప్రైవేట్ వెంచర్ల విలువ ₹వేల కోట్లకు చేరింది. TOD పేరుతో జరుగుతున్న ఈ భూముల కేటాయింపులపై ఇప్పటికే హైకోర్టులో PIL దాఖలయ్యాయి.