News August 22, 2025
మణుగూరు: ‘విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి’

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్య చాలా ముఖ్యమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శుక్రవారం మణుగూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాల, తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, భోజనశాల, వసతి గృహాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల అవసరాలను తెలుసుకుని, పాఠశాల యాజమాన్యానికి తగు సూచనలు చేశారు.
Similar News
News August 23, 2025
మట్టి గణపతిని పూజించండి: కలెక్టర్ ప్రావీణ్య

వినాయక నవరాత్రి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. చెరువులు కలుషితం కాకుండా మట్టి వినాయక విగ్రహాలని పూజించాలని సూచించారు. పోలీసు అధికారుల సూచనలు నిర్వాహకులు పాటించాలని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News August 23, 2025
ములుగు జిల్లా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ములుగు జిల్లాలో నిరుద్యోగ యువతకు SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా 18-45 ఏళ్ల ఉన్న నిరుద్యోగ యువతకు హౌస్ వైరింగ్, సెల్ఫోన్ రిపేర్‌లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఈ శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వరంగల్ జిల్లా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని కార్యాలయంలో ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ సూచించారు.
News August 23, 2025
టీడీపీ నేత పొలంలో క్షుద్ర పూజల కలకలం

పెద్దకడబూరు మండలం జాలవాడికి చెందిన టీడీపీ గ్రామ అధ్యక్షుడు ముక్కన్న పత్తి పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం క్షుద్ర పూజలు చేశారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపుతుంది. మూడు నెలల క్రితం ముక్కన్న ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసిన దుండగులే ఇప్పుడూ పత్తి పొలంలో చేసినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై ముక్కన్న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.