News August 22, 2025

బోజ్యతండాలో నాలుగేళ్ల తర్వాత మోగిన బడి గంటలు

image

పాల్వంచ మండలం బోజ్యతండాలో నాలుగేళ్లుగా మూతపడ్డ ప్రాథమిక పాఠశాల శుక్రవారం తిరిగి ప్రారంభమైంది. పాల్వంచ MPDO విజయ భాస్కర్ రెడ్డి ఈ పాఠశాలను పునఃప్రారంభించారు. గతంలో గ్రామంలో బడి వయసు పిల్లలు లేకపోవడంతో పాఠశాలను మూసివేశారు. ఇటీవల విద్యాశాఖ కమిషనర్ జిల్లా పర్యటన సందర్భంగా మూతబడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

Similar News

News March 24, 2026

ADB: జిల్లాలో 15కు చేరనున్న అసెంబ్లీ స్థానాలు..?

image

కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రాజకీయ ముఖచిత్రం మారనుంది. ప్రస్తుతం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 50 శాతం పెరుగుదల ప్రకారం ఈ సంఖ్య 15కు చేరే అవకాశం ఉంది. అదిలాబాద్ అర్బన్, నిర్మల్, మంచిర్యాల వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాలు విభజనకు గురై కొత్త సెగ్మెంట్లు ఏర్పడవచ్చు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు.

News March 24, 2026

NGKL: మండుతున్న ఎండలు.. ఐనోల్‌లో 38.9 డిగ్రీలు!

image

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అచ్చంపేట మండలం ఐనోల్‌లో 38.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బొల్లంపల్లి(38.6), కొల్లాపూర్(38.2)లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 24, 2026

WGL: ఎన్నికలు ముగిశాయి.. డిపాజిట్లు వచ్చేదెన్నడు?

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా సాగిన పంచాయతీ ఎన్నికలు ముగిసినా, అభ్యర్థుల డిపాజిట్ల విడుదలపై స్పష్టత కరువైంది. జిల్లా వ్యాప్తంగా 1684 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన 26,071 మందిలో సుమారు 70 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్లు దక్కించుకున్నారు. ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా, తమ నిధులు ఎప్పుడు తిరిగిస్తారా అని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.