News August 22, 2025
ప్రకాశం: కానిస్టేబుల్ అభ్యర్థుల పత్రాల పరిశీలన.. 22 మంది గైర్హాజరు.!

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమానికి 327 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సాగిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమానికి అభ్యర్థులు ఉదయం నుంచే హాజరయ్యారు. అయితే 22 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు.
Similar News
News March 23, 2026
కందుకూరులో వ్యభిచారం.. మహిళలు అరెస్ట్

ప్రకాశం జిల్లాలో వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరు పట్టణం ఉప్పుచెరువు ప్రాంతంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని ఎస్ఐ పులి శివ నాగరాజుకు సమాచారం అందింది. తన సిబ్బందితో ఆదివారం దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు.
News March 23, 2026
చీమకుర్తిపై యుద్ధం ఎఫెక్ట్..!

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో గ్రానైట్ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. దీనికి యుద్ధం తోడు కావడంతో చీమకుర్తిలోని గ్రానైట్ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. యుద్ధం నేపథ్యంలో ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడంతో ఈ పరిశ్రమల కష్టాలు మరింత పెరిగాయి. క్వారీల్లో భారీ యంత్రాలకు ఈ డీజిల్ చాలా అవసరం. దీనిపై సబ్సిడీలు ఇస్తేనే గ్రానైట్ రంగం గట్టెక్కుతుందని పలువురు కోరుతున్నారు.
News March 23, 2026
ఒంగోలులో జాబ్ మేళా.. రూ.41 వేల జీతం.!

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పలు ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయని, 18 నుంచి 35 ఏళ్ల వయసు గలవారు అర్హులని తెలిపారు. రూ.14 వేల నుంచి రూ.41 వేల వరకు వేతనం అందే అవకాశం ఉందన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చన్నారు.


