News August 22, 2025
కామారెడ్డి జిల్లాలో విషాదం

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. జంగంపల్లి గ్రామానికి చెందిన సైదుగారి శ్రావణ్(36) మద్యానికి బానిసగా మారి, ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News March 4, 2026
ఫిన్+టిమ్= అదిరెన్.. T20WCలో సరికొత్త చరిత్ర

T20WC-2026లో కివీస్ ఓపెనర్లు <<19299520>>ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్<<>> రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ఈ ఎడిషన్‌లో 10.93 రన్ రేట్‌తో 463 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. T20WC హిస్టరీలో పరుగులు, రన్ రేట్ పరంగా ఇవే అత్యధికం. 2024లో ఇబ్రహీం-గుర్బాజ్ 7.6 RRతో 446 రన్స్, 2021లో బాబర్-రిజ్వాన్ 7.33 RRతో 411 పరుగులు, 2022లో బట్లర్-హేల్స్ 9.2 RRతో 368 రన్స్, 2007లో గిల్‌క్రిస్ట్-హెడెన్ 8.93 RRతో 335 పరుగులు చేశారు.
News March 4, 2026
MBNR: ఈనెల 8వ తేదీకి సదస్సు వాయిదా

10th క్లాస్ తర్వాత స్టూడెంట్స్ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. MBNRలో MAR 5న జరగాల్సిన ఈసదస్సు అనివార్య కారణాలతో MAR 8న(ఆదివారం) నిర్వహించనున్నారు. MBNR రైల్వేస్టేషన్ రోడ్డులోని సుదర్శన్ ఫంక్షన్ హాల్‌లో ఉ.10.30కి దీనిని నిర్వహించనుండగా CBI EX JD లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు. స్టూడెంట్స్, పేరెంట్స్ హాజరుకాగలరు.
News March 4, 2026
నెల్లూరు: మహిళలకు ఆత్మరక్షణపై శిక్షణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సామూహిక ఆత్మరక్షణ శిక్షణ బుధవారం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ Ch. సౌజన్య పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కరాటే నిపుణులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపద సమయాల్లో తమను తాము ఎలా కాపాడుకోవాలో మహిళలకు ప్రత్యక్షంగా వివరించారు.


