News August 22, 2025
నేను చనిపోలేదు: నటుడు

తాను చనిపోలేదంటూ బాలీవుడ్ నటుడు రజా మురాద్ ఏకంగా పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. తన మరణంపై SMలో దుష్ప్రచారం జరుగుతోందని, ఇది చూసి ఫ్యాన్స్ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారని వాపోయారు. తన మృతిపై వస్తున్న వదంతులపై స్పష్టతిస్తూ అలసిపోయానని, ఇది తీవ్రమైన విషయమన్నారు. ఇలా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై అంబోలి పోలీసులను కోరారు. రజా మురాద్ ఇంద్రలో విలన్‌గా మెప్పించారు.
Similar News
News August 23, 2025
కేంద్ర మంత్రి కుమారుడిని ముద్దాడిన చంద్రబాబు

AP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులకు జన్మించిన కుమారుడిని సీఎం చంద్రబాబు ముద్దాడారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సీఎం రామ్మోహన్ ఇంటికి వెళ్లి ఆ చిన్నారికి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ తండ్రి ఎర్రన్నాయుడితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అనంతరం వారి బాగోగులు తెలుసుకున్నారు.
News August 23, 2025
ఫైనల్‌కు దూసుకెళ్లిన తుంగభద్ర వారియర్స్

APL క్వాలిఫయర్-2లో భీమవరం బుల్స్‌పై తుంగభద్ర వారియర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు నేరుగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇవాళ వైజాగ్‌లో జరిగే ఫైనల్లో అమరావతి రాయల్స్‌తో తలపడనుంది. తొలుత భీమవరం ఓవర్లన్నీ ఆడి 183/5 పరుగులు చేసింది. తోట శ్రవణ్ (71*) రాణించారు. అనంతరం 19 ఓవర్లలోనే 5 వికెట్ల కోల్పోయి తుంగభద్ర లక్ష్యాన్ని ఛేదించింది. గుట్ట రోహిత్ (87) విధ్వంసం సృష్టించారు.
News August 23, 2025
సురవరం మృతిపై CM రేవంత్, KCR దిగ్భ్రాంతి

TG: కమ్యూనిస్ట్ అగ్ర నేత <<17489686>>సురవరం సుధాకర్ రెడ్డి<<>> మృతిపై సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురవరం మృతి యావత్ దేశానికే తీరని లోటు అని పేర్కొన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం, కోమటిరెడ్డి, రాజనర్సింహ, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.