News August 22, 2025

కామారెడ్డి: గణేశ్ ఉత్సవాల నిర్వహణపై రేపు కీలక సమావేశం

image

కామారెడ్డిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, సమన్వయంతో నిర్వహించేందుకు రేపు (శనివారం) సాయంత్రం 4 గంటలకు కళాభారతిలో సమావేశం జరగనుంది. గణేశ్ నవరాత్రులు, శోభాయాత్రల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అన్ని గణేశ్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, మండపాల ఆర్గనైజర్లు తప్పక హాజరై, ఈ పండుగ విజయవంతానికి సహకరించాలని జిల్లా పోలీస్ శాఖ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Similar News

News March 20, 2026

ఫ్యూచర్ సిటీకి ‘పైసల’ కళ.. రియల్ ఎస్టేట్ కొత్త చిరునామా!

image

CM కలల ప్రాజెక్టు ‘ఫ్యూచర్ సిటీ’కి ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కురిపించనుది సర్కారు. దాదాపు 30,000 ఎకరాల్లో విస్తరించే ఈ స్మార్ట్ సిటీ కోసం ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,000 కోట్లను కేటాయించబోతోందని తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే AI City, స్పోర్ట్స్ వర్సిటీకి ఇందులో సింహభాగం దక్కనుంది. కేవలం భూసేకరణకే కాకుండా RRRతో అనుసంధానించే రేడియల్ రోడ్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు.

News March 20, 2026

తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన

image

TGలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, NZB, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గంటకు 41-61KM వేగంతో గాలులు వీచే ఆస్కారముందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు నిన్న రాత్రి HYDలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

News March 20, 2026

108ఏళ్ల మాజీ MLA కన్నుమూత

image

AP: చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న రాజన్(108) కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు నుంచి MLAగా విజయం సాధించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందారు. ఆస్తులు, సొంత ఇల్లు లేకుండా నిరాడంబర జీవితం గడిపారు. ప్రభుత్వ పెన్షన్‌తోనే జీవనం సాగించారు.