News August 22, 2025
కంచికచర్లలో రోడ్డు ప్రమాదం.. తల్లి, బిడ్డ మృతి

కంచికచర్ల మండలం కీసర గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పసికందు మృతిచెందిన <<17483745>>విషయం తెలిసిందే<<>>. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లి నాగబత్తిని చైతన్యను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News August 23, 2025
కేంద్ర మంత్రి కుమారుడిని ముద్దాడిన చంద్రబాబు

AP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులకు జన్మించిన కుమారుడిని సీఎం చంద్రబాబు ముద్దాడారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సీఎం రామ్మోహన్ ఇంటికి వెళ్లి ఆ చిన్నారికి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ తండ్రి ఎర్రన్నాయుడితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అనంతరం వారి బాగోగులు తెలుసుకున్నారు.
News August 23, 2025
మెదక్: నాడు విద్యార్థి.. నేడు గెజిటెడ్ హెచ్ఎం

మెదక్ మండలం మాచవరం ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలుగా వై. సుకన్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హవేలిఘనపూర్ మండలం కూచన్‌పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆమె పదోన్నతిపై వెళ్లారు. అయితే ర్యాలమడుగు గ్రామానికి చెందిన సుకన్య మాచవరం పాఠశాలలోనే చదువుకున్నారు. అదే పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టడం విశేషం.
News August 23, 2025
మట్టి గణపతిని పూజించండి: కలెక్టర్ ప్రావీణ్య

వినాయక నవరాత్రి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. చెరువులు కలుషితం కాకుండా మట్టి వినాయక విగ్రహాలని పూజించాలని సూచించారు. పోలీసు అధికారుల సూచనలు నిర్వాహకులు పాటించాలని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.