News August 22, 2025

అనకాపల్లి: ‘రేపు జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర కార్యక్రమం’

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 23న స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో దీనిపై సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రతకు పెద్దపీటవేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఆగస్టు నెల ‘వర్షాకాలం-పరిశుభ్రత’ థీమ్‌గా ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు.

Similar News

News March 12, 2026

జిల్లాలో గ్యాస్ కొరత లేదు: తూ.గో కలెక్టర్

image

తూ.గో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. నిత్యం గృహ వినియోగదారులు, హాస్టళ్లు, ఆసుపత్రులకు 11 వేల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 14,829 సిలిండర్లు స్టాక్‌గా అందుబాటులో ఉన్నాయన్నారు. IOC, HPC, BPC ద్వారా సరఫరా సజావుగా సాగుతోందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

News March 12, 2026

క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ B.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని, మున్సిపల్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

News March 12, 2026

అనకాపల్లి జిల్లాలో వారందరి ఖాతాల్లో రూ.134 కోట్లు జమ!

image

అనకాపల్లి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద 2,42,536 మంది లబ్ధి కలుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. వీరి ఖాతాల్లో ఈ నెల 13న రూ.134.27 కోట్లు జమ అవుతాయన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,202 మంది, చోడవరంలో 51,269, మాడుగుల 45,604, ఎలమంచిలి 33,648, నర్సీపట్నంలో 35,147, పెందుర్తి 15,364, పాయకరావుపేటలో 39,302 మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.