News August 22, 2025
సదాశివనగర్: తిమ్మాజివాడి పనుల జాతరలో కలెక్టర్

సదాశివనగర్ మండలం తిమ్మాజివాడి గ్రామంలో పనుల జాతరలో ఈరోజు జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వన్ పాల్గొని మాట్లాడారు. గ్రామంలో చేపట్టబోయే పనులకు ప్రణాళిక తయారు చేసుకోవడం, కొత్త పనులకు శంకుస్థాపన, ఉపాధి హామీలో 100 రోజులు పనిచేసిన సభ్యులను, దివ్యాంగులను సన్మానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ సురేందర్, ఎంపీడీవో, మండల సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 19, 2026
గ్యాస్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి: రిజ్వాన్ బాషా

జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు నూతన నిబంధనలను అమలు చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఈ మార్పులను గమనించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే బుకింగ్ చేయాలని సూచించారు.
News March 19, 2026
ప్రభుత్వాల పాలన ప్రజా రంజకంగా ఉంటుంది: బుట్టే వీరభద్ర దైవజ్ఞ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన ఈ ఏడాది ప్రజా రజకంగా ఉంటుందని శ్రీశైల దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ అన్నారు. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాలు మంచిగా కురుస్తాయన్నారు. దేశం సుభిక్షంగా ఉంటూ ప్రజలు సంతోషంగా ఉంటారని, గోవులు అధిక క్షీరాన్ని ఇస్తాయన్నారు. ఈ ఏడాది భారత దేశంలో ఎటువంటి గ్రహణములు కనపడవన్నారు.
News March 19, 2026
అదృష్టం తెచ్చిన కూతురు..

‘ధురంధర్’తో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ స్టార్‌డమ్ అమాంతం పెరిగింది. కొవిడ్ తర్వాత ఆయన తీసిన చిత్రాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి. 2022లో జయేశ్‌భాయ్ జోర్దార్, సర్కస్, 2023లో రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 2024లో రణ్‌వీర్, దీపికా పదుకొణె దంపతులకు పాప జన్మించింది. 2025లో డైరెక్టర్ ఆదిత్య ధర్ ‘ధురంధర్’ ప్రాజెక్టు రావడంతో రణ్‌వీర్ బ్లాక్‌బస్టర్ కొట్టారు.


