News August 22, 2025

BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోలా ఆనంద్

image

BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోలా ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో గ్రామ, గ్రామాన పార్టీ విస్తరణకు తన వంతు కృషి చేస్తానని కోలా ఆనంద్ పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్: కలెక్టర్

image

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జనరల్ ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 15 ఏళ్లలోపు బాలికలందరికీ జనరల్, ఏరియా ఆసుపత్రుల్లో ఈ టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు.

News March 13, 2026

అల్లూరి: 4 మండలాల్లో 100 శాతం పన్నుల వసూళ్లు

image

ఉమ్మడి అల్లూరి జిల్లాలోని 4 మండలాల్లో 100శాతం ఇంటి పన్నులు వసూలు జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ గురువారం తెలిపారు. కొయ్యురు, హుకుంపేట, ముంచింగిపుట్టు, పోలవరం జిల్లాలో వై.రామవరం మండలాల్లో పూర్తి గా పన్నులు వసూలు అయ్యాయన్నారు. జిల్లాలో మొత్తం 430 పంచాయతీల్లో 373 పంచాయతీల్లో పన్నులు వసూళ్లు పూర్తి అయ్యిందన్నారు.

News March 13, 2026

గ్రామాలు, పట్టణాల అభివృద్ధే దేశ అభివృద్ధి: కలెక్టర్

image

గ్రామాలు, పట్టణాల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, సర్పంచులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్యం, పౌష్టికాహారం, పరిశుభ్రత, పెన్షన్లు, ఉపాధి హామీ, పాఠశాలల పర్యవేక్షణపై అధికారులు సూచనలు ఇచ్చారు.