News August 22, 2025
నిజామాబాద్: LLB & LLM పరీక్షల ఫీజు తేదీల ప్రకటన

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని LLB & LLM IV సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు సెప్టెంబర్ నెలలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఫీజు తేదీలను వర్సిటీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈనెల 28వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, అదే విధంగా అపరాధ రుసుముతో సెప్టెంబర్ 1వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని కంట్రోలర్ ప్రొ.కే.సంపత్ కుమార్ తెలిపారు. విద్యార్థులు గమనించి గడువులోగా ఫీజు చెల్లించాలన్నారు.
Similar News
News March 7, 2026
అన్నమయ్య: ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు

భారతీయ వాయుసేన అగ్నివీర్ వాయు పోస్టులకు ఓపెన్ రిక్రూట్ ర్యాలీ నిర్వహిస్తోందని అన్నమయ్య జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి నాగార్జున తెలిపారు. 2005 జూలై 2, 2009 జనవరి 2వ తేదీ మధ్యలో పుట్టి 152CM ఎత్తున్న అవివాహితులు అర్హులు. ఇంటర్, డిప్లొమా, 2ఏళ్ల ఒకేషనల్ కోర్సు పాసై, ఇంగ్లిష్‌లో 50%మార్కులు ఉండాలి. అన్ని సర్టిఫికెట్లతో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో మహిళలు మార్చి 9, పురుషులు మార్చి 12న హాజరు కావాలి.
News March 7, 2026
హెలికాప్టర్‌లో పొగలు.. యూపీ Dy.CMకు తప్పిన ప్రమాదం

యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్యాబిన్‌లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పైలట్ అప్రమత్తమై వెంటనే లక్నోలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో మౌర్యతో సహా ఐదుగురు హెలికాప్టర్‌లో ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News March 7, 2026
మాచర్ల ప్రభుత్వ ఐటీఐలో 9న అప్రెంటిస్ మేళా

మాచర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 9న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా జరగనుందని ప్రిన్సిపల్ పవన్ కుమార్ తెలిపారు. ఈ మేళాలో ఐటీఐ పాసైన (అన్ని ట్రేడ్‌ల) విద్యార్థులు పాల్గొన వచ్చని చెప్పారు. ఈ మేళాకు వివిధ రకాల ప్రముఖ కంపెనీలు హాజరవుతున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


