News August 22, 2025
ఉచితంగా పాసు పుస్తకాల పంపిణీ: అనగాని

AP: రైతులకు ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉంటుందని చెప్పారు. తప్పులకు ఆస్కారం లేకుండా, క్షుణ్ణంగా పరిశీలించాకే ముద్రించినట్లు వివరించారు. కొత్త పుస్తకాల్లో రైతులు మార్పులు కోరితే పరిశీలించి నిబంధనల ప్రకారం ఉచితంగా మారుస్తామన్నారు. ప్రస్తుతం 21 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
Similar News
News March 19, 2026
పీసీసీ అంశంపై మంత్రి కోమటిరెడ్డి స్పష్టత

పీసీసీ అధ్యక్ష పదవి మార్పుపై వస్తున్న వార్తలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఆయన సారథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిందని గుర్తుచేశారు. జగ్గారెడ్డి పనితీరును ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని అయన తెలిపారు.
News March 19, 2026
ధురంధర్-2.. ప్రీమియర్స్‌తోనే రూ.75 కోట్లు

రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్-2 మూవీ చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ ద్వారానే అత్యధిక వసూళ్లు(₹75Cr) సాధించిన భారత చిత్రంగా నిలిచినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. INDలోనే ₹52.50Cr(గ్రాస్) వచ్చినట్లు పేర్కొంది. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌తోనే హయ్యెస్ట్ కలెక్షన్లు($2.5M) సాధించిన ఇండియన్ సినిమాగానూ నిలిచినట్లు వివరించింది. ఈ క్రమంలో OG(₹25Cr), యానిమల్($1.2M)ను వెనక్కి నెట్టింది.
News March 19, 2026
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన CBN, జగన్

AP: నిత్యం ఒకే తరహా డ్రెస్సులో కనిపించే CM చంద్రబాబు, మాజీ CM జగన్ ఉగాది వేళ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. పంచె కట్టుకొని, భుజంపై కండువా వేసుకొని తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించారు. ఇలా కొత్త దుస్తుల్లో వారిని చూసిన అభిమానులు, ఆయా పార్టీల కార్యకర్తలు SMలో ఫొటోలు షేర్ చేస్తున్నారు. తమ అభిమాన నేతల ఫొటోలను పోస్టులు పెడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సీఎం, మాజీ సీఎంల లుక్ మీకెలా అనిపించింది?


