News August 22, 2025
కామారెడ్డి: అభివృద్ధి పనుల జాతరతో గ్రామాలకు నూతన కళ

కామారెడ్డి జిల్లాలో పనుల జాతర కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం జిల్లాలోని వివిధ గ్రామాల్లో మొత్తం 57 గ్రామ పంచాయతీ భవనాలు, 50 అంగన్‌వాడీ భవనాలు, 134 స్కూల్ టాయిలెట్స్, 400 పశువుల షెడ్లతో సహా అనేక అభివృద్ధి పనులు ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ వెల్లడించారు. ఈ పనుల ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 5, 2026
MBNR: బిడ్డను ఉయ్యాలలో వదిలి.. అనంతలోకాలకు

అప్పుల బాధ ఆ పసిగుడ్డుకు తల్లిని దూరం చేసింది.. తండ్రిని మృత్యువుతో పోరాడేలా చేసింది. జంగమయ్యపల్లిలో చోటుచేసుకున్న <<19307113>>దంపతుల ఆత్మహత్యాయత్నం<<>> స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పులు తీర్చే మార్గం కనిపించక మురుగని దంపతులు తమ పొలంలో పసిబిడ్డను ఉయ్యాలలో వేసి, పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నారు. చనిపోయే ముందు రవి తన తమ్ముడికి వీడియో కాల్ చేసి ‘మేము ఇక బతకలేం’ అని రోదించడం అందరినీ కలిచివేసింది.
News March 5, 2026
MBNR: ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

నవాబుపేట(M) జంగమయ్యపల్లిలో అప్పుల ఊబిలో చిక్కుకున్న ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మురుగని రవి-లావణ్య దంపతులు తమ పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నారు. చనిపోయే ముందు రవి HYDలోని తన తమ్ముడికి వీడియో కాల్ చేసి, తాము చనిపోతున్నామని తెలిపారు. ఈ ఘటనలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా.. కొన ప్రాణంతో ఉన్న రవిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
News March 5, 2026
విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.


