News August 22, 2025
వరంగల్: మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలోని 10 జూనియర్ కళాశాలల మౌలిక వసతుల పనులను దసరా లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. ‘అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి’పై సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.1.36 కోట్లు కేటాయించిందని తెలిపారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని ప్రిన్సిపాల్స్, కమిటీ ఛైర్మన్లను ఆదేశించారు.
Similar News
News August 23, 2025
వరంగల్ డీఈవో జ్ఞానేశ్వర్‌కు స్థానచలనం

వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న వరంగల్ డీఈవో మామిడి జ్ఞానేశ్వర్‌ను నిర్మల్ జిల్లా FAC FAOగా పంపిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ డా.నవీన్ నికోలస్ శఉక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జ్ఞానేశ్వర్‌పై వివిధ ఉపాధ్యాయ సంఘాలు 21 ఆధారాలతో కూడిన ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ డైరెక్టర్ వేటు వేసినట్లు తెలుస్తోంది.
News August 22, 2025
రేపటి నుంచి ప్రభుత్వ జూ.కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు

ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూ.కళాశాలల్లో ఈనెల 23 నుంచి ముఖ గుర్తింపు హాజరు(ఫేస్ రికగ్నెషన్ సిస్టమ్) హజరు పద్దతి అమలు చేయనున్నట్లు DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఈరోజు ఇంటర్ విద్య కార్యాలయంలో ప్రిన్సిపళ్లకు, సంబంధిత ఇన్ఛార్జ్లకు నూతన హాజరు విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీజీబీఐఈ-ఎఫ్ ఆర్ఎస్ యాప్ ఇన్స్టాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని రోజువారీ హాజరు నమోదు చేయాలన్నారు.
News August 22, 2025
విద్యార్థుల ఆరోగ్యం & విద్యాభివృద్ధికి మరో ముందడుగు: మంత్రి

విద్యార్థుల ఆరోగ్యం & విద్యాభివృద్ధి కోసం మరో ముందడుగు అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో మెస్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచి వసతులు మెరుగుపరుస్తూ రామకృష్ణ మిషన్ & అక్షయపాత్ర సహకారంతో జిల్లాలోని 123 ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్ఠికాహార మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభమైంది. కరీమాబాద్ బీరన్నకుంట పాఠశాలలో విద్యార్థులకు మంత్రి భోజనం వడ్డించారు. కలెక్టర్, మేయర్ ఉన్నారు.