News August 22, 2025

ప్ర‌త్యేక బృందాల‌తో విస్తృత త‌నిఖీలు: కలెక్టర్

image

జిల్లాలో యూరియా, ఇత‌ర ఎరువుల స‌ర‌ఫ‌రాపై నిరంత‌ర నిఘాతో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశా తెలిపారు. శుక్ర‌వారం అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు త‌దిత‌రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఎరువులు స‌మృద్ధిగా అందుబాటులో ఉన్న నేప‌థ్యంలో ఎక్క‌డా ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై మంత్రులు, సీఎస్ దిశానిర్దేశం చేశారు.

Similar News

News March 21, 2026

జగిత్యాల: జీవన్ రెడ్డి అలక వీడేనా?

image

జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద జరిగిన చర్చలు ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చర్చలు జరిపినప్పటికీ జీవన్ రెడ్డి అలక వీడనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉమ్మడి KNR జిల్లా మంత్రులు బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు అధిష్ఠానం, మరోవైపు స్థానిక నేతల చర్చలు కొనసాగుతుండడంతో జీవన్ రెడ్డి తుది నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.

News March 21, 2026

కాఠిన్యం వెనక కన్నీటి గాథలు.. TG పోలీస్ భావోద్వేగ ట్వీట్

image

కరీంనగర్ 2 టౌన్ SI చంద్రశేఖర్ సూసైడ్ పట్ల TG పోలీస్ భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘ఖాకీ వెనక కఠినత్వమే కాదు చట్టాన్ని కాపాడే కళ్లలో కన్నీటి గాథలూ ఉంటాయి. కర్తవ్యనిష్ఠతో కాలం విసిరే కర్కశత్వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. గద్దరించే గొంతు పలకని మాటల భారంతో నిశ్శబ్దం వైపు పయనించింది’ అంటూ కవిత రూపంలో నివాళులర్పించింది. భార్య దివ్య ఇటీవల ఆత్మహత్య చేసుకోగా తట్టుకోలేక నేడు చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు.

News March 21, 2026

భద్రాద్రికి బడ్జెట్ ‘భరోసా’.. బీమా, విద్యార్థులకు వరం

image

బడ్జెట్‌లో జిల్లాకు ప్రభుత్వం కీలక కేటాయింపులు చేసింది. రేషన్ కార్డు కలిగిన 3,22,738 కుటుంబాలకు ‘ఇందిరమ్మ జీవిత బీమా’ కింద రూ.5 లక్షల చొప్పున భద్రత కల్పించనున్నారు. విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, ఇంటర్ చదువుతున్న 4,300 మందికి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అలాగే ATCల్లో శిక్షణ పొందుతున్న 688 మందికి నెలకు రూ.2 వేల చొప్పున ఉపకార వేతనం అందనుంది.