News August 22, 2025

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఎన్టీఆర్ జిల్లా నేతలకు చోటు

image

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు నాయకులకు చోటు లభించింది. శ్రీనివాసరాజు హెడ్ క్వార్టర్స్ ఇన్‌ఛార్జ్, బొడ్డు నాగలక్ష్మీ ఎస్సీ కోటాలో రాష్ట్ర కార్యదర్శి, పాతూరి నాగభూషణం ప్రోటోకాల్ ఇన్‌ఛార్జ్, కిలారి దిలీప్ మీడియా ఇన్‌ఛార్జ్, అలాగే, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సయ్యద్ భాష నియమితులయ్యారు.

Similar News

News April 3, 2026

ఇంట్లో కుండలోని నీటిని తాగుతున్నారా?

image

వేసవి తాపాన్ని తీర్చే మట్టి కుండ నీరు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ శుభ్రత పాటించకపోతే అదే అనారోగ్యానికి దారితీయవచ్చు. మట్టి కుండలో నీరు సురక్షితంగా ఉండేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. ‘కొత్త కుండను వాడే ముందు రోజంతా నీటిలో నానబెట్టాలి. రోజూ వేడి నీటితో కడగడం వల్ల బాక్టీరియా చేరదు. కుండను కడిగేందుకు సబ్బు వాడకండి. ఉప్పు లేదా బేకింగ్ సోడాతో మాత్రమే రుద్దడం మేలు’ అని సూచిస్తున్నారు.

News April 3, 2026

టీనేజర్ల ఫిజికల్ రిలేషన్.. కిడ్నాప్ కేసులో బాలుడికి ఊరట

image

15 ఏళ్ల బాలికతో ఫిజికల్ రిలేషన్ కారణంగా కిడ్నాప్ కేసు ఎదుర్కొంటున్న బాలుడికి ఉత్తరాఖండ్ హైకోర్టు ఉపశమనం కలిగించింది. అతనిపై జువెనైల్ జస్టిస్ బోర్డ్‌లో జరగాల్సిన విచారణను నిలిపివేసింది. తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని బాలుడిపై తండ్రి కేసు పెట్టారు. అయితే తానే అతడిని ఇంటికి ఆహ్వానించానని, పరస్పర అంగీకారంతోనే సంబంధం కొనసాగించామని బాలిక కోర్టుకు చెప్పింది. దీంతో బాలుడికి కోర్టు కేసు నుంచి ఊరటనిచ్చింది.

News April 3, 2026

తెలంగాణలో కొత్త పెన్షన్ చెల్లింపు విధానం..!

image

2026-27 కొత్త ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్లు చెల్లించడంలో TG GOVT E-PPO (ఎలక్ట్రిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్) అనే ఓ కొత్త విధానాన్ని 2 నెలల్లో ప్రవేశపెట్టనుంది. తద్వారా పెన్షన్‌దారులు ఆఫీస్‌కు వెళ్లకుండా తమ వివరాలను నేరుగా అప్‌డేట్ చేసుకోవడం, 12 నంబర్లతో ఉన్న ఒక కోడ్ ద్వారా ప్రతి నెల పెన్షన్ పొందడం, మరణించిన వారి చెల్లింపులు తక్షణం నిలిపివేయడానికి సహాయపడుతుంది.