News August 22, 2025
విజయవాడలో ప్రశాంతంగా యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు

విజయవాడలోని లబ్బీపేట రెడ్ సర్కిల్‌లో ఉన్న బిషప్ అజరయ్య బాలికల కళాశాల పరీక్షా కేంద్రంలో యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీశా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మొదటి రోజు పరీక్షకు మొత్తం 106 మంది అభ్యర్థులకు గాను, 102 మంది హాజరైనట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు పరీక్షలు రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News April 1, 2026
మెదక్ జిల్లాలో LPG గ్యాస్ కొరత లేదు

మెదక్ జిల్లాలో ఎక్కడా LPG గ్యాస్ కొరత లేదని జిల్లా పౌర సరఫరాధికారి నిత్యానంద్ తెలిపారు. 16 ఏజెన్సీల ద్వారా రోజుకు సుమారు 3,200 సిలిండర్లు బుకింగ్ కాగా, 100% డెలివరీ జరుగుతోందన్నారు. గోదాముల్లో 3,500 సిలిండర్లు ఉండగా, 6,179 ట్రాన్సిట్‌లో ఉన్నాయన్నారు. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు కమర్షియల్ సిలిండర్లనే వాడాలని, డొమెస్టిక్ వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 1, 2026
PHOTO GALLERY: పండు వెన్నెల్లో అందాల రామయ్య పెళ్లి

AP: కడప(D) ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం చూసి వేలాది మంది భక్తులు పులకించిపోయారు. శ్రీరామ నామస్మరణతో ఆలయం ప్రతిధ్వనించింది. అంతకుముందు సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాగా ఈ నెల 5వ తేదీ వరకు ఒంటిమిట్టలో ఉత్సవాలు కొనసాగనున్నాయి.
News April 1, 2026
MDK: ఏడుపాయలో ఘనంగా దుర్గమ్మ పల్లకీ సేవ

మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం అమ్మవారి పల్లకీ సేవ ఘనంగా జరిగింది. ఉత్సవ విగ్రహాన్ని సుందరంగా అలంకరించి, ఆలయ ప్రాంగణంలో శోభాయాత్రగా ఊరేగించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తిపారవశ్యంతో నిండిపోయాయి. అంతకుముందు మూలవిరాట్‌కు అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.


