News August 22, 2025
జిల్లాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

NTR జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను ఆయన సందర్శించారు. జిల్లాలో ఉన్న అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలను పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. రాజధాని అమరావతికి గేట్‌వేగా ఉన్న NTR జిల్లాలో పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు.
Similar News
News August 23, 2025
MBNR: రాజా ది గ్రేట్!

ఆయన తెలంగాణ మట్టికి అరుదైన గౌరవం తెచ్చారు.. NASA Artemis మిషన్‌లో కమాండర్‌గా అద్భుత సేవలందించారు. ఫాల్కన్-9 రాకెట్‌లో నలుగురు వ్యోమగాములతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు బయలుదేరిన మిషన్‌కు నేతృత్వం వహించి.. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని పెంచారు. ఆయనే మహబూబ్‌నగర్ మూలాలున్న రాజాచారి. నేడు అంతరిక్ష దినోత్సవాన, ఇటువంటి శాస్త్రవేత్తల స్ఫూర్తిదాయక ప్రయాణం యువతకు ప్రేరణనిస్తుంది.
News August 23, 2025
EP44: ఈ విషయాల్లో సిగ్గు పడకండి: చాణక్య నీతి

కొన్ని విషయాల్లో సిగ్గు పడితే జీవితానికే నష్టమని చాణక్య నీతి చెబుతోంది. ‘డబ్బు విషయంలో సిగ్గు పడకూడదు. అప్పు ఇస్తే నిర్మొహమాటంగా అడిగి తీసుకోవాలి. బంధువులు, ఫ్రెండ్స్ ఇళ్లలో తినే విషయంలో సిగ్గు ఉండకూడదు. ఏదో అనుకుంటారని తినకుండా ఆకలి చంపుకోకూడదు. తెలియని విషయాన్ని తెలుసుకొని జ్ఞానం పొందేందుకు ఇతరులను అడిగి నేర్చుకోవాలి. అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయాలి’ అని పేర్కొంటోంది. #<<-se>>#chanakyaneeti<<>>
News August 23, 2025
మెదక్ జిల్లాలో 23 మంది కొత్త గెజిటెడ్ HMల నియామకం

ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతిలో భాగంగా మెదక్ జిల్లాకు 23 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అలాట్ అయ్యారు. ఇందులో శుక్రవారం 22 మంది ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారు బాధ్యతలు చేపట్టారు. జిల్లాల వారీగా మెదక్-9, ఖమ్మం-6, సిద్దిపేట -4, హన్మకొండ-2, కొత్తగూడెం, కామారెడ్డి ఒక్కొక్కరు ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి సర్ధన హై స్కూల్ పోస్టింగ్ ఇచ్చిన ఉపాధ్యాయురాలు జాయిన్ కాలేదు. 15 రోజుల సమయం ఉంది.