News August 22, 2025

లింగాపూర్: లింగాపూర్‌లో రూ. 52 లక్షలతో అభివృద్ధి పనులు

image

పెగడపల్లి మండలం లింగాపూర్‌ గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నిధుల ద్వారా సుమారు రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు, రూ. 12 లక్షలతో నిర్మించనున్న నూతన అంగన్‌వాడీ భవనానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 21, 2026

నంద్యాల జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు

image

రంజాన్ వేడుకలను నంద్యాల(D)లో శనివారం ఘనంగా నిర్వహించారు. రంజాన్ మాసం సందర్భంగా నెల రోజులపాటు ఉపవాసం ఉండి ఈద్గాలో సామూహిక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షను విరమించారు. పట్టణంలోని కర్నూలు రోడ్డులో గల ఈద్గా వద్ద ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందికొట్కూరులోని ప్రార్థనలు పై ఫొటోలో చూడవచ్చు.

News March 21, 2026

అక్షరాయుధాల గడ్డ.. మన కరీంనగర్..!

image

ఉమ్మడి KNR జిల్లా అంటేనే సాహిత్యానికి పురిటిగడ్డ. ఇక్కడి మట్టిలో పుట్టిన కవిత్వం విశ్వవ్యాప్తమైంది. జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి మొదలుకొని, ఎందరో మహానుభావులు ఈ నేల సత్తాను చాటారు. నవ కవులకు మార్గదర్శిగా నిలుస్తున్న సాహిత్య వారసత్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. నేటి తరం యువత కూడా సాహిత్య బాటలో నడిచి జిల్లా ఖ్యాతిని మరింత పెంచాలని కోరుకుందాం. నేడు ప్రపంచ కవితా దినోత్సవం.

News March 21, 2026

శ్రీకాకుళం: ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు…!

image

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో 912 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీల పాలకవర్గం గడువు ముగియనుంది. సమయం దగ్గర పడుతుండటంతో ప్రత్యేక అధికారులు జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మండలం యూనిట్ గా క్లస్టర్లు విభజించి గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించే ఏర్పాట్లు చేస్తున్నారు. పాలకవర్గం లేకుండా పంచాయతీల ప్రగతి కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు.