News August 23, 2025
క్వాంటం వ్యాలీకి ఏపీ కేరాఫ్ అడ్రస్: CM CBN

AP: దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ వ్యాలీని JANలో రాష్ట్రంలో ఆవిష్కరిస్తున్నామని CM CBN తెలిపారు. క్వాంటం వ్యాలీకి రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరంలో చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే IND నం.1 కావాలని, మనదేశానికి ఆ సత్తా ఉందన్నారు. HYDలో IT అభివృద్ధి కోసం హైటెక్‌సిటీ నిర్మించామని, అమరావతిలో AI టెక్నాలజీతో క్వాంటం వ్యాలీ సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
Similar News
News March 11, 2026
రాష్ట్రంలో మూడో డిస్కం

TG: రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటైంది. దీనికి తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TGRPDCL)గా పేరు పెడుతూ ప్రభుత్వం GO జారీ చేసింది. CMDగా ముషారఫ్ అలీ ఫరూఖీని, మరో నలుగురు డైరెక్టర్లను నియమించింది. వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, వాటర్ సప్లై స్కీమ్/మిషన్ భగీరథ, HMWSSB, మున్సిపల్ వాటర్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించనుంది. కొత్త వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వనుంది.
News March 11, 2026
రైల్వేపై LPG ప్రభావం.. ఫుడ్ డెలివరీలో అంతరాయం!

భారత్‌లో LPG కొరత రైల్వే వ్యవస్థపైనా ప్రభావం చూపుతోంది. రైళ్లలో భోజన సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. టికెట్ బుకింగ్ సమయంలోనే ఫుడ్ ఆర్డర్ చేసినవారికే ప్రయారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అటు ప్రత్యామ్నాయ వంట పద్ధతులకు మారాలని స్టేషన్లలోని ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్, జన్ ఆహార్ అవుట్‌లెట్లకు IRCTC లేఖ రాసింది. ఈ సంస్థ రోజుకు 17 లక్షల భోజనాలు డెలివరీ చేస్తోంది.
News March 11, 2026
‘విజయ’ పేరిట కల్తీ నెయ్యి.. పరీక్షిస్తామన్న మంత్రి లోకేశ్

AP విజయ బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న నెయ్యిలో కల్తీ జరుగుతోందని TGDDCF ఛైర్మన్ <<19324480>>అమిత్ రెడ్డి<<>> చేసిన ఆరోపణలపై మంత్రి లోకేశ్ స్పందించారు. మార్కెట్ నుంచి రాండమ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. TGDDCF వద్ద ఉన్న CALF, NDDB టెస్ట్ రిపోర్ట్స్‌ను కూడా పరిశీలిస్తామన్నారు. క్వాలిటీ, కస్టమర్ల ఆరోగ్యం విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. మేఘనా ఫుడ్స్‌కు విజయ(AP) ఫ్రాంచైజీ ఇచ్చారు.


