News August 23, 2025

సంగారెడ్డి: స్కూల్ అసిస్టెంట్ ఖాళీల జాబితా విడుదల

image

ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం స్కూల్ అసిస్టెంట్ ఖాళీల జాబితాలు విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. మొత్తం 248 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. వీటిలో 70% పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. పదోన్నతుల కోసం 1:3 ఎస్జీటీ ఉపాధ్యాయుల జాబితాలు శనివారం విడుదల చేస్తామని తెలిపారు.

Similar News

News March 15, 2026

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: డీఐజీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జనవరి 1 నుంచి ఈనెల 13వ తేదీ వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఓవర్ స్పీడ్ 1,889, హెల్మెట్ లేకుండా 1,763, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 79 కేసులు నమోదు కాగా, 1,686 డ్రంకెన్ డ్రైవింగ్, 2,223 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

News March 15, 2026

సంగారెడ్డి: ఎస్సీ కార్పొరేషన్ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక పథకాలకు ఈనెల 17 నుంచి 24 వరకు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు పత్రాలను ప్రింట్ తీసుకుని సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు స్థానిక అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

News March 15, 2026

ప్రయాణికులకు శుభవార్త.. ప్రతి 45 నిమిషాలకో ఏసీ బస్సు

image

వేసవి దృష్ట్యా ఖమ్మం నుంచి హైదరాబాద్‌, మియాపూర్‌కు ప్రతి 45 నిమిషాలకో ఏసీ రాజధాని నాన్‌స్టాప్‌ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ శివప్రసాద్‌ తెలిపారు. కొత్త బస్టాండ్‌ నుంచి సూపర్‌ లగ్జరీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ముందస్తు రిజర్వేషన్ల కోసం tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.