News August 23, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤మాతాశిశు మరణాలు తగ్గించాలి: జిల్లా కలెక్టర్
➤సరుబుజ్జిలి: చెరువులను తలపించే గోతులతో రోడ్లు
➤ అచ్చెన్నాయుడు రైతులు నడ్డి విరుస్తున్నారు: ఎమ్మెల్సీ దువ్వాడ
➤ పోలీస్ శిక్షణ కేంద్రం పనులు పూర్తిచేయాలి: డీఐజీ
➤ఎచ్చెర్ల: ఐటెప్ కోర్సులోకి కౌన్సెలింగ్ ప్రారంభం
➤ఆదిత్యుని సేవలో ఏపీ జెన్ కో ఎండీ
➤టెక్కలి: ఎండల మల్లన్నకు పసుపు అలంకరణ

Similar News

News September 10, 2025

శ్రీకాకుళం: డయల్ యువర్ కలెక్టర్

image

ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య డయల్ యువర్ కలెక్టర్ ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం వెల్లడించారు. ఎరువులు సంబంధిత విషయాలపై డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు. ఎరువులు, సంబంధిత విషయాలుపై ఈ కార్యక్రమం ద్వారా నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావచ్చును. ఫోన్ నంబర్ 09842 222565, 08942 222648లకు ఫోన్ చేయవచ్చని చెప్పారు.

News September 9, 2025

SKLM: ఆందోళన చెందవద్దు

image

నేపాల్ రాజధాని ఖాట్మండులో అల్లర్లు, ఆందోళనలు నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారి సమస్యను తెలుసుకున్న శ్రీకాకుళం MP, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు యాత్రికులకు ఆందోళన చెందవద్దు అని భరోసా కల్పించారు. వారందరిని సురక్షితంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే AP భవన్ కమీషనర్ ప్రవీణ్‌తో సమీక్ష నిర్వహించారు.

News September 9, 2025

శ్రీకాకుళం: ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర మంత్రి

image

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన ఓటు హక్కును మంగళవారం వినియోగించుకున్నారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించిన పోలింగ్‌ను పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించారు. పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.