News August 23, 2025
DSC అభ్యర్థులకు కీలక సూచనలు

AP: కాల్ లెటర్ అందిన DSC అభ్యర్థులకు కన్వీనర్ కృష్ణారెడ్డి పలు సూచనలు చేశారు. ‘ఒరిజినల్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన 3సెట్ల సర్టిఫికెట్ల కాపీలు, 5పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ వెరిఫికేషను(CV)కు హాజరు కావాలి. ముందే వాటిని సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. CVకి తప్పనిసరిగా రావాలి. హాజరుకాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేస్తాం’ అని తెలిపారు.
Similar News
News August 23, 2025
భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్.. కేంద్రం క్లారిటీ

భారత్‌లో మళ్లీ<<17486073>> టిక్‌టాక్<<>> వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ‘టిక్‌టాక్‌పై నిషేధం ఇంకా కొనసాగుతోంది. దానిని అన్‌బ్లాక్ చేసినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస్తున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు’ అని స్పష్టం చేసింది. భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో ఈ ప్రచారం చర్చనీయాంశంగా మారింది.
News August 23, 2025
12 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు: ADR

దేశంలో 30 మంది సీఎంలు ఉండగా 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ADR (ASSOCIATION FOR DEMOCRATIC REFORMS) తెలిపింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89, తమిళనాడు సీఎం స్టాలిన్‌పై 47 కేసులు ఉన్నాయని పేర్కొంది. ఏపీ సీఎం చంద్రబాబు 19 క్రిమినల్ కేసులతో మూడో స్థానంలో ఉన్నారని వెల్లడించింది. సీఎంలు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ వివరాలతో ADR ఈ రిపోర్టును విడుదల చేసింది.
News August 23, 2025
ఈ నెల 25న అల్పపీడనం.. భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా-ప.బెంగాల్ తీరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖఫట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.