News August 23, 2025

HEADLINES

image

* నేరస్థులు, అవినీతిపరులు అధికారంలో ఉండొద్దు: ప్రధాని మోదీ
* మోదీ ఓట్ చోర్ మహారాజ్: రాహుల్
* క్వాంటం వ్యాలీకి ఏపీ కేరాఫ్ అడ్రస్: CM చంద్రబాబు
* AP DSC మెరిట్ జాబితా విడుదల
* ఢిల్లీలో కుక్కల అంశంపై వెనక్కి తగ్గిన సుప్రీం.. స్టెరిలైజ్ చేసి వదిలేయాలని ఆదేశం
* తెలంగాణలో ప్రశాంతంగా ‘గో బ్యాక్ మార్వాడీ’ బంద్
* సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

Similar News

News August 23, 2025

మెగాస్టార్ నుంచి 4 సినిమాలు.. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు?

image

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నలుగురు డైరెక్టర్లతో పనిచేస్తున్నారు. వశిష్ఠతో ‘విశ్వంభర’, అనిల్ రావిపూడితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ, ‘దసరా’ డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ దర్శకత్వంలోనూ చేయబోతున్నట్లు ప్రకటించారు. చిరు-అనిల్ సినిమా సంక్రాంతికి, ‘విశ్వంభర’ వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఆ తర్వాత బాబీ, శ్రీకాంత్ సినిమాలు పట్టాలెక్కే అవకాశముంది.

News August 23, 2025

బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటున్నారా?.. జాగ్రత్త!

image

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. వైట్ బ్రెడ్, ప్యాకేజ్డ్ జ్యూసులు, డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ తీసుకోవద్దని, వీటి వల్ల బరువు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. పూరీలు, మైసూర్ బోండాలు, పరోటాలు, పకోడీలకు బదులు ఇడ్లీ, ఉప్మా, తక్కువ ఆయిల్‌తో చేసిన దోశలు తినాలని సూచిస్తున్నారు.

News August 23, 2025

ఫలితాలు విడుదల.. టాపర్లు వీరే

image

AP: DSC-2025 మెరిట్ లిస్టు PGT ప్రిన్సిపల్ జాబితాలో 75.5 స్కోరుతో చింతల గౌతమ్ టాపర్‌గా నిలిచారు. 73 స్కోరుతో జి.రాజశేఖర్ 2వ ర్యాంక్ సాధించారు. PGT ఇంగ్లిష్‌లో స్వరూప(87 స్కోరు), హిందీలో రమేశ్(93.5), సంస్కృతంలో భాను(94), తెలుగులో ధర్మారావు(85.5), బయాలజీలో శివకుమార్(81.5), గణితంలో విజయ్(78.5), ఫిజికల్ సైన్స్‌లో బాలకిశోర్(74.5), సోషల్‌లో నిరోష(85) టాపర్లుగా నిలిచారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.