News August 23, 2025

సిరిసిల్ల: ‘ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లేటట్టు నిర్మించాలి’

image

గణేష్ మండపాలను ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లేటట్టు నిర్మించాలని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. మండపాలలో ఎల్లప్పుడూ ఒకరు వాలంటరీగా ఉండాలన్నారు. మండపాల నిర్మాణం నాణ్యత ఏర్పాటు చేసుకోవాలని, షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాలు ఏర్పాటు చేసేవారు సంబంధిత శాఖల అనుమతి, అలాగే విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. రాత్రి 10 వరకు మాత్రమే స్పీకర్లు ఉండాలన్నారు.

Similar News

News March 23, 2026

దుబ్బాక: ఉరేసుకొని బీటెక్ విద్యార్థి మృతి

image

దుబ్బాక మండలం తిమ్మాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. జడ్పీటీసీ మాజీ సభ్యుడు కడతాల రవీందర్ రెడ్డి తమ్ముడు యాదవ రెడ్డి కుమారుడు భాను ప్రసాద్ రెడ్డి(21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. భాను ప్రసాద్ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు స్థానికులు తెలిపారు.

News March 23, 2026

మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి: చంద్రబాబు

image

AP: శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని CM చంద్రబాబు కొనియాడారు. ఆయన జయంతి వేళ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రానికి ముందే శెట్టిబలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారన్నారు. లోకేశ్ సైతం ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. కాగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.

News March 23, 2026

నెల్లూరులో వణుకు పుట్టిస్తున్న ASP దీక్ష..!

image

నెల్లూరులో 2 నెలల కిందట బాధ్యతలు తీసుకున్న ASP దీక్ష తనదైన ముద్ర వేస్తున్నారు. సిటీలో ఆకస్మిక తనిఖీలకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఏకకాలంలో లాడ్జీలపై దాడులు చేసి <<19450738>>వ్యభిచార ముఠాను <<>>పట్టుకున్నారు. నగరంలోని దాబాల్లో రాత్రి వేళ మద్యం విక్రయాలు జరగుతున్నాయి. దీనిపైనా ఆమె దాడులు చేసి ఒకేసారి <<19452217>>40మందిని <<>>పట్టుకున్నారు. రౌడీషీటర్లకు సైతం తనదైన శైలిలో వార్నింగ్‌లు ఇస్తున్నారు.