News August 23, 2025

ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు: జేసీ

image

కాలువలు, చెరువు గట్లపై ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి “వాచ్ డాగ్” కమిటీ సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 361.86 ఎకరాల ఆక్రమణలపై పరిశీలించి, వాటిని తొలగించే దిశగా అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

Similar News

News March 26, 2026

ప.గో: మీ ఊరి నుంచి భద్రాచలానికి డైరెక్ట్ బస్సులు.. ఇవిగో డీటెయిల్స్!

image

ఈనెల 26 నుంచి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం డిపోల నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ RM గిరిధర్ కుమార్ తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎప్పుడైనా వెళ్లడానికి వీలుగా బస్సులు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని RM తెలిపారు. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News March 26, 2026

ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వేసవి ఉద్ధృతి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.