News April 2, 2024

ఈనెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

ఓటు హక్కు పొందేందుకు ఇదే చివరి అవకాశం అని, ఏప్రిల్ ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఈనెల 14వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో ఓటు వేసే అవకాశం లభిస్తుందని, దరఖాస్తు చేసుకుంటే నూతనంగా ఓటు పొందవచ్చునని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను 10 రోజులలో పరిశీలించి కొత్త ఓటు హక్కు కల్పిస్తామన్నారు.

Similar News

News March 16, 2026

114 అర్జీలను స్వీకరించాం: అనంత ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 114 పిటీషన్లు స్వీకరించినట్లు ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. పిటీషనర్లతో ముఖాముఖి మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పిటీషనర్లు, వీరి వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఇస్కాన్ సహకారంతో ఉచిత భోజన సదుపాయం కల్పించామన్నారు.

News March 16, 2026

అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలి: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో కలెక్టర్ ఆనంద్ అధికారులు అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన 405 అర్జీలను సంబంధిత శాఖలు నిర్ణీత గడువులో పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News March 16, 2026

నేటి నుంచి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

image

జాతీయ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నేటి నుంచి ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని పశుసంవర్థక శాఖ జేడీ ప్రేమ్‌చంద్ తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పశువులకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాకు 3.20 లక్షల మందు డోసులు సరఫరా అయ్యాయని, ప్రతి గ్రామంలోని పశువులకు ముందస్తుగా టీకాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.