News August 23, 2025
చాపాడు PSను తనిఖీ చేసిన జిల్లా SP

చాపాడు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని SI చిన్న పెద్దయ్యను ఆదేశించారు. ఉమెన్ హెల్ప్ డెస్క్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News August 23, 2025
యూరియా డీలర్లతో కలెక్టర్ సమావేశం

యూరియా కృత్రిమ కొరతను సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రైవేట్ ఫర్టిలైజర్స్ డీలర్లను హెచ్చరించారు.
శుక్రవారం రాత్రి వ్యవసాయ, విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు, ఫర్టిలైజర్స్ డీలర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో దాదాపు 430 ప్రైవేట్ ఫర్టిలైజర్స్ షాపుల వద్ద యూరియా ఎరువుల వివరాలతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. JC అధితిసింగ్, DAO చంద్రానాయక్ పాల్గొన్నారు.
News August 23, 2025
కడప జిల్లాలో యూరియా కొరతలేదు..!

కడప జిల్లాలో ఎక్కడైనా యూరియా కొరత ఉంటే 24 గంటల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం యూరియా లభ్యతపై JC అధితిసింగ్, DAO చంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రైతుల అవసరాలకు తగినంత యూరియా స్టాక్ ఉందన్నారు. ఒక ఎకరాకు ఒక బస్తా సరిపోతుందన్నారు. కావల్సినంత మాత్రమే వినియోగించాలని, యూరియా విషయంలో దళారులు తప్పుదోవపట్టిస్తే చర్యలు తప్పవన్నారు.
News August 22, 2025
కడప జేసీ కీలక ఆదేశాలు

స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రణాళికాబద్ధంగా వృద్ధి సాధించాలని కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్-2047పై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. లక్ష్యాలను చేరుకునేందుకు, జిల్లా వృద్ధి రేటు 15 శాతానికి పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో లక్ష్యాలను సంపూర్ణం చేయాలని సూచించారు.